Tuesday, September 20, 2022

Talking Governor

 Talking Governor 

Kerala is witnessing an ugly spat between the Governor and the CM

Kerala Governor Arif Mohammad Khan’s outburst against the ruling Communist Party of India (Marxist) and its functionaries including Chief Minister Pinarayi Vijayan marks an escalation in tensions between him and the elected government. Until now, Mr. Khan and Mr. Vijayan had maintained a functional relationship despite their apparent differences. At the heart of the current flare-up is Kannur University’s controversial decision to appoint the wife of Mr. Vijayan’s private secretary as an associate professor. Mr. Khan, who is also the chancellor of the university, has been critical of the move, but his decision to hold a full-length press conference crossed a line and damaged the majesty of his office. In the presser, Mr. Khan lashed out at CPI(M) functionaries and labelled some of their actions as being anti-national, nepotism, and anti-social. As an unelected appointee of the Centre, a Governor of a State is expected to appreciate the popular mandate of the elected government. By going public with his views, Mr. Khan has precipitated a situation which should have been avoided. The CPI(M) and other parties in the ruling Left Democratic Front (LDF), led by Mr. Vijayan have reciprocated the Governor’s feelings, making the exchange a nasty episode. Among other things, representatives of the ruling front have called Mr. Khan an unhinged agent of the Rashtriya Swayamsevak Sangh (RSS). Mr. Khan could have raised his concerns, however valid as he might deem them to be, with Mr. Vijayan rather than triggering a completely avoidable public spat.

Mr. Khan’s unprecedented public criticism of the elected government is incongruous with the high office that he holds, but the issues that he has raised put the ruling front on the defensive. One can debate whether a Governor is mandated to enforce standards of governance, but Mr. Khan is evidently not restrained. He had raised a hue and cry over the practice of State pensions to political appointees who serve as personal staff of Ministers for 30 months. Mr. Khan has now locked horns with the LDF over governance questions related to universities and the crippling of the Lok Ayukta, the anti-corruption ombudsman that might lose its powers to punish to the State Assembly. The Governor has made it clear that he will not be signing two Acts, one related to higher education and one on Lok Ayukta. Regardless of the Assembly’s powers to make such laws, the moral case for doing so is rather tenuous. Electoral majority is the foundation of representative democracy, but institutional checks and balances are also its integral parts. The elected government and the Governor should both pipe down, and discuss these questions in a calm manner with the objective of seeking solutions and advancing the State’s development.

Monday, January 24, 2022

బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే.. Jan 25, 2022, 09:38 IST

 Prashant Kishor: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..

Jan 25, 2022, 09:38 IST

Prashant Kishor Explains What Steps Congress Party Need To Defeat BJP - Sakshi

కాంగ్రెస్‌లో పునర్‌వ్యవస్థీకరణ అవసరం 


పరస్పర నమ్మకం కుదరకే కాంగ్రెస్‌లో చేరలేదు 


2024లో బీజేపీని ఓడించడం సాధ్యమే 


రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌ 


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల అనంతరం ఐదు నెలలపాటు చర్చలు జరిపానని, కానీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఆయన ఎన్‌డీటీవీతో మాట్లాడారు.



ఒక సంస్థగా కాంగ్రెస్‌ పట్ల తనకు గౌరవభావం ఉందన్నారు. కాంగ్రెస్‌ లేకుండా దేశంలో ప్రభావవంతమైన ప్రతిపక్షం సాధ్యం కాదని ప్రశాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్‌కు అంత శక్తి లేదని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో పునర్‌వ్యవస్థీకరణ అవసరమని చెప్పారు. కాంగ్రెస్‌లో తాను చేరాలనుకోవడం కేవలం ఏదో ఒక ఎన్నికల కోసం కాదని, పార్టీని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాలని తాను భావించానని చెప్పారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో చేరికపై దాదాపు రెండేళ్లు  చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు.


ఆ సమయంలో చాలామంది తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననే భావించారన్నారు. కానీ ఇందుకు ఇరు పక్షాలు పరస్పర విశ్వాసంతో ఒకడుగు ముందుకు వేయాల్సిఉందని, కాంగ్రెస్‌తో అలా జరగలేదని చెప్పారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం తనకు చేదు అనుభవమని, అప్పటినుంచి కాంగ్రెస్‌లో చేరడంపై సందేహంగానే ఉన్నానని చెప్పారు. అలాగే తాను పూర్తిస్థాయిలో విశ్వాసపాత్రుడిగా ఉండనని కాంగ్రెస్‌ భావించిఉండవచ్చన్నారు.  

(చదవండి: బడ్జెట్‌ సమావేశాలపై బులెటిన్‌ విడుదల)


ఇలా సాధ్యం.. 

రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే, 2024లో ఆ పార్టీని ఓడించడం సాధ్యమేనని ప్రశాంత్‌ అభిప్రాయపడ్డారు. 2024లో ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించేందుకు తాను సాయం చేయాలని భావించానని చెప్పారు.  అయితే ఇందుకు ప్రస్తుత పార్టీలు, నాయకత్వాలు, కూటములు పనికిరావని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పార్టీలు కొన్ని సర్దుబాట్లు, కొన్ని మార్పులు చేసుకుంటే బీజేపీని ఓడించవచ్చని, ఇందుకోసం కొత్తగా ఒక జాతీయస్థాయి పార్టీ పుట్టుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు.


దాదాపు 200 సీట్లున్న బీహార్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీకి దక్కినవి కేవలం 50 సీట్లేనని గుర్తు చేశారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లోని 350 సీట్లలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని, అందుకే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు సర్దుబాట్లు, వ్యూహాలతో వ్యవహరించి పైన చెప్పిన 200 సీట్లలో 100 సీట్లను కొల్లగొడితే ఇప్పుడున్న సీట్లతో కలిపి ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 200– 250ని చేరుతుందన్నారు. అప్పుడు బీజేపీని ఓడించేందుకు ఉత్తరాన లేదా పశ్చిమాన మరో 100 సీట్లు గెలిస్తేచాలన్నారు. ఈ వ్యూహంతో 2024లో ప్రతిపక్షాలకు సాయం చేయాలని తాను భావించానని ప్రశాంత్‌ చెప్పారు.  


ఆ మూడే బలం.. 

హిందుత్వ, అతి జాతీయవాదం, సంక్షేమాన్ని జతకలిపి బీజేపీ బలమైన ఆయుధం తయారు చేసుకుందని ప్రశాంత్‌ అభిప్రాయపడ్డారు. వీటిలో కనీసం రెండిటి విషయంలో ప్రతిపక్షాలు ప్రజలకు నమ్మకం కలిగిం చాల్సిఉందన్నారు. ఇది చేయకుండా మహా కూటమి పేరిట ఎన్ని పార్టీలు కలిసిపొత్తులు పెట్టుకున్నా ఉపయోగం ఉండదన్నారు. దేశంలోని ఎంపీ సీట్లలో దాదాపు 200 సీట్లలో కాంగ్రెస్‌– బీజేపీ మధ్యనే పోటీ ఉందని, వీటిలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ దాదాపు 95 శాతం సీట్లు గెలుస్తోందని గుర్తు చేశారు.


రాబోయే రాష్ట్రాల ఎన్నికలను 2024కు సూచికగా పరిగణించాల్సిన అవస రం లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవచ్చని చెప్పారు. యూపీలో బీజేపీపై గెలవాలంటే సోషల్‌ బేస్‌ను విస్తరించుకోవాలని సూచించారు. బీజేపీని ఓడించాలనుకునే పార్టీ లేదా నాయకుడికి కనీసం 5– 10ఏళ్లకు సరిపడా వ్యూహరచన ఉండాలని, ఐదు నెలల్లో అద్భుతాలు జరగవని చెప్పారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలన్నదే తన అభిమతమన్నారు. టీఎంసీకి సాయం చేయడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, కాంగ్రెస్‌పై కక్షతో టీఎంసీకి సాయం చేశాననడం సరికాదని తెలిపారు. ఒక బడా పార్టీపై కక్ష కట్టే శక్తి తనకు లేదని, తను చాల చిన్న వ్యక్తినని చమత్కరించారు.   






Sunday, January 23, 2022

యూపీలో మండల్ శక్తుల తిరుగుబాటు

యూపీలో మండల్ శక్తుల తిరుగుబాటు 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంభవిస్తున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీని కలవరపరుస్తున్నాయి. హిందూత్వకు ఒక గట్టి ప్రతిఘటనగా లౌకిక విలువలు, మత బహుళత్వం పునరుత్థానమయ్యేందుకు చరిత్రాత్మక రైతు ఉద్యమం దోహదం చేయగా, సామాజిక న్యాయం ఎజెండాను పునరుద్ధరించాలని ఇతర వెనుబడిన తరగతుల (ఓబీసీ) వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి తీరని నష్టం కలిగించనున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

రైతు ఉద్యమం పశ్చిమయూపీలో జాట్‌లు, ముస్లింలను ఏకం చేసింది. ప్రజలను కుల మతాల వారీగా విడదీసే బీజేపీ రాజకీయాలకు అడ్డుకట్ట వేసింది. ముజాఫర్‌నగర్‌లో మతోన్మాద అల్లర్ల నేపథ్యంలో యూపీ ప్రజల్లో మతపరమైన చీలికలను సృష్టించడం ద్వారా 2014 సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ విశేషంగా లబ్ధి పొందింది. హిందూ–-ముస్లిం వైషమ్యాలకు తోడు తీవ్రస్థాయిలో ప్రజ్వరిల్లిన జాతీయవాద మనోభావాలు 2017 అసెంబ్లీ, 2019 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ విజయాలకు తిరుగులేని విధంగా తోడ్పడ్డాయి. ముస్లింలతో తమ సంప్రదాయ రాజకీయ మైత్రిని విడనాడిన జాట్ రైతులు ఆ రెండు ఎన్నికలలో బీజేపీకి మూకుమ్మడిగా ఓటు వేశారు. ఎన్నికల విజయాలతో ఆ పార్టీ తన హిందూత్వ ఎజెండాను మరింతగా ముందుకు తీసుకువెళ్ళింది. ముస్లింల మత విశ్వాసాలపై దాడి చేసింది. వారి ఆహార, చివరకు వస్త్ర ధారణ అలవాట్లను కూడా తెగనాడింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగుచట్టాలు మతాలకు అతీతంగా రైతులందరినీ సమైక్యపరిచాయి. పశ్చిమ యూపీలో రైతుల మధ్య మతాలకు అతీతంగా పునరుజ్జీవమైన సమైక్యత ముజఫర్‌నగర్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో సంపూర్ణంగా ప్రతిబింబించింది. రాకేష్ తికాయిత్ ‘అల్లా హో అక్బర్’ అని ఎలుగెత్తినప్పుడు మహాపంచాయత్‌లో పాల్గొన్న రైతులు అందరూ ముక్తకంఠంతో హర హర మహదేవ్ అంటూ ప్రతిస్పందించారు. లౌకికవాదానికి ప్రధానమైన ఈ మత బహుళత్వం ప్రజలను మతాల వారీగా విడదీసే హిందూత్వ ఎజెండాకు పూర్తిగా విరుద్ధమైనది. ‘విద్వేషమే బీజేపీ రాజకీయాల ప్రమాణ చిహ్నం’ అని రాకేశ్ తికాయత్ వ్యాఖ్యానించాడు. ప్రజల్లో వెల్లివిరిసిన ఈ మత సమైక్యత యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నది. ఈ వాస్తవాన్ని గుర్తించినందునే తాము తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే అప్పటికే చాలా జాప్యం జరిగింది.రైతు ఉద్యమంతో పాటు సామాజిక న్యాయ ఎజెండా పునరుద్ధరణ కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలి నుంచి వైదొలిగి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు- స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరం సింగ్ సైనీ-తో సహా పలువురు బీజేపీ శాసనసభ్యులే సామాజిక న్యాయ ఎజెండాను సమగ్రంగా అమలు పరచాలని పట్టుబడుతున్నారు. యోగి ప్రభుత్వం నుంచి వైదొలిగిన ముగ్గురు మంత్రులు తమ తమ సామాజిక వర్గాలలో గణనీయమైన పలుకుబడి ఉన్నవారు. గతంలో బీజేపీ ఎన్నికల విజయాలకు వారు విశేషంగా సహాయపడినవారే. సామాజిక న్యాయం పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నది వారి ఆరోపణ. ‘సామాజిక పునర్నిర్మాణం కంటే సామాజిక న్యాయానికి తక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. హిందూత్వ లక్ష్యాల సాధనకు అవసరమైన సంఖ్యాధిక్యతలను వెనుకబడిన కులాలు, దళితుల మద్దతుతో సమకూర్చుకోవడమే బీజేపీ పునర్నిర్మాణ కార్యక్రమం. అగ్రకులాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యమని వారు విమర్శించారు.

యోగి ప్రభుత్వం మైనారిటీల శ్రేయస్సును విస్మరించి ఉన్నత కులాల వారినే అన్ని విధాల ప్రోత్సహిస్తుందని స్వామి ప్రసాద్ మౌర్య తదితరులు ధ్వజమెత్తారు. మైనారిటీల పట్ల అన్ని విషయాలలోనూ వివక్ష చూపడం సాధారణమైపోయిందని వారు పేర్కొన్నారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల విషయంలో కూడా యూపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడం లేదు. విద్యా ఉద్యోగాలలో ఆ బడుగు వర్గాలకు రిజర్వేషన్లను అర్హులైన అభ్యర్థులు లేరనే సాకుతో అమలుపరచడం లేదు. తమకు న్యాయబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్లు దక్కకపోవడం పట్ల ఆ సామాజిక వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఉద్యోగ నియామకాలలో తమ పట్ల పూర్తి ఉదాసీనత చూపడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న ఉద్యోగాల విషయంలో కూడా తమకు న్యాయం చేయకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత ఠాకూర్ కులస్తులకే అన్నిటా అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం పట్ల మిగతా సామాజిక వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. రాజకీయ, పాలనా రంగాలలో కీలక పదవులు అన్నిటిలోనూ ఠాకూర్లే కనిపిస్తున్నారు. యూపీ సమాజంలో వారి ప్రాబల్యం పెరిగిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. గమనార్హమైన విషయమేమిటంటే తమ ఓట్ల ఆధారంగా అధికారానికి వచ్చిన హిందూత్వవాదులు అగ్రకులాలకే అధిక ప్రాధాన్యమిస్తూ తమ శ్రేయస్సును ఉపేక్షిస్తున్నారని ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గట్టిగా విశ్వసిస్తున్నారు. కేవలం మైనారిటీలనే కాకుండా వెనుకబడిన కులాలు, దళితులను సైతం హిందూత్వ అణచివేస్తుందనే సత్యాన్ని అర్థం చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.నిరుద్యోగిత అంతకంతకూ పెచ్చరిల్లిపోతోంది. ధరలు భరించలేని విధంగా పెరిగిపోతున్నాయి. ఆహార భద్రత కొరవడుతోంది. ఆరోగ్య సంక్షోభం సరేసరి. ఈ సమస్యలన్నీ ఉత్తరప్రదేశ్ ప్రజలు అందరినీ వేధిస్తున్నాయి. అయితే మరెవ్వరికంటే వెనుకబడినకులాలు, అణగారిన వర్గాల వారే వాటి భారాన్ని ఎక్కువగా చవిచూస్తున్నారు. కొవిడ్–19 రెండో దశ తీవ్రత యూపీ ప్రజలను ఇప్పటికీ భయకంపితులను చేస్తోంది. వైద్య సదుపాయాలు, మందుల కొరతతో కుటుంబసభ్యులు, ఇతర ఆప్తులను కోల్పోవలసిరావడం చాలామందిని అంతులేకుండా బాధిస్తూనే ఉంది. సార్స్ కోవ్–2 రూపాంతరమైన ఒమైక్రాన్ ప్రస్తుతం విజృంభిస్తున్నప్పటికీ ఆ పరిస్థితులలో ఇప్పటికీ మెరుగుదల లేకపోవడం వారిని అమితంగా కలవరపరుస్తోంది. మహమ్మారిని అదుపు చేయడంలో యోగి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోయిందనే భావం ప్రజల్లో బలంగా ఉంది.

కులాల వారీగా జనాభా గణన నిర్వహించాలన్న ఓబీసీ నాయకుల డిమాండ్‌ను అటు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమూ, ఇటు లక్నోలోని యోగి సర్కార్ రెండూ నిర్ద్వంద్వంగా తిరస్కరించడాన్ని సంబంధిత వర్గాల ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ తిరస్కరణ తమను అవమానించడమేనని వారు ఆగ్రహిస్తున్నారు. వారి ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఎంతైనా ఉంది. దీనికి తోడు తమ పార్టీ అధికారానికి వస్తే మూడు నెలలలోగా బీసీ జనాభా గణన నిర్వహిస్తామని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఓబీసీలు ఇప్పటికే ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది బీజేపీకి ప్రతికూల పరిస్థితిని సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.

యోగి పాలనలో తమ సామాజిక, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడం వల్ల వెనుకబడినకులాల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. బీజేపీ నుంచి వైదొలగి హిందూత్వను వ్యతిరేకించాలని వారు తమ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారు. హిందూత్వ భావజాలమే తమకు అస్తిత్వ సంక్షోభాన్ని సృష్టించిందని ఆ నాయకులూ గ్రహిస్తున్నారు. అందుకు వారు బీజేపీ నుంచి వైదొలుగుతున్నారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల శ్రేయస్సుకు కీలకమైన సామాజిక న్యాయం ఎజెండాను బీజేపీ పూర్తిగా ఉపేక్షిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. 

రైతు ఉద్యమ లౌకిక విలువలు, మత సామరస్యం, ఓబీసీ నాయకుల సామాజిక న్యాయ ఎజెండా బీజేపీకి ఒక ప్రతికూల పరిస్థితిని సృష్టించాయి. ఈ కారణంగా ఎన్నికల రాజకీయాల సంక్ష్లిష్టతలను గతంలో వలే అధిగమించగలగడం హిందూత్వ పార్టీకి అసాధ్యంగా ఉంది. ఇది వారిని తీవ్రంగా కలవరపరుస్తోంది. హిందూత్వ లక్ష్యాల సాధనకు కీలకమైన ఓబీసీల మద్దతు బీజేపీకి ఏ విధంగాను లభించని పరిస్థితి ఏర్పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు 80 శాతం మందికి, 20 శాతం మందికి మధ్య జరగనున్న పోరాటమని యోగి ఆదిత్యనాథ్ అభిర్ణించారు. ఆ గణాంకాలు రాష్ట్ర జనాభాలోని హిందువులు, ముస్లింల నిష్పత్తిని ప్రతిబింబిస్తున్నాయనేది అందరికీ తెలిసిన వియమే. ఆ వ్యాఖ్య ద్వారా ముస్లింల పట్ల హిందూత్వ దృక్పథమేమిటో మరోసారి విశదమయింది. సామాజిక న్యాయాన్ని కూడా అది వ్యతిరేకిస్తుందనే విషయం కూడా అందరికీ అర్థమయింది.

సామాజిక న్యాయ ఎజెండా పునరుద్ధరణ మండల్ వెర్సెస్ కమండల్ రాజకీయాలను గుర్తు చేస్తుంది. మతతత్వాన్ని సామాజికన్యాయం పదిహేను సంవత్సరాల పాటు అదుపులో ఉంచిన రాజకీయాలవి. కమండల్ ప్రాధాన్యం సంతరించుకున్న తరువాతనే సామాజిక న్యాయశక్తులు బలహీనపడ్డాయి. తద్వారా హిందూత్వ రాజకీయాలు ప్రభవించడానికి దారి సుగమమయింది. క్రింది స్థాయి వర్గాల వారి సమానత్వం, సామాజిక న్యాయ డిమాండ్లను బలహీనపరిచేందుకే బీజేపీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పూనుకున్నది. అందుకే కారిడార్ ప్రాజెక్టునూ ప్రారంభించింది.

యూపీ అసెంబ్లీ ఎన్నికలలో 40 శాతం స్థానాలు మహిళా అభ్యర్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయం హిందూత్వ మహిళా వ్యతిరేక ఎజెండాపై ప్రతికూల ప్రభావం తప్పక చూపుతుంది. లౌకికవాద విలువల పరిరక్షణకు పోరాటం మహిళా హక్కుల కోసం పోరాటమే అన్న అభిప్రాయం పూర్తిగా సహేతుకమైనది. రాజకీయాలలో జెండర్ న్యాయం లౌకికవాదాన్ని కాపాడడంతో పాటు హిందూత్వను తిరస్కరిస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లో చాలా సంవత్సరాల తరువాత సామాజికన్యాయం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎవరూ విస్మరించలేని వాస్తవం. సామాజిక న్యాయ ఆకాంక్షలూ, ఆరాటాలూ బీజేపీని ప్రజాక్షేత్రంలోనూ, ఎన్నికల పోరాటంలోనూ బలహీనపరుస్తాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అంతేకాకుండా అవి జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసి లౌకికవాదశక్తులను ఉత్సాహపరిచి వాటిని ‘భారత్ భావన’ వెనుక సమైక్యపరుస్తాయి. హిందూత్వ శక్తుల పురోగతిని అడ్డుకున్న ప్రతిష్ఠ రైతులు, వెనుకబడిన కులాలు, జెండర్ న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తులకే దక్కుతుంది. 

ఎస్.ఎన్. సాహు(మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ప్రెస్ సెక్రటరీ)

Sunday, January 16, 2022

అఖిలేశ్‌కు ‘ప్రాంతీయ’ మద్దతు!

 Jan 15 2022 @ 02:35AMహోంజాతీయంఅఖిలేశ్‌కు ‘ప్రాంతీయ’ మద్దతు!అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీతో తృణమూల్‌, ఎన్సీపీ పొత్తు

ప్రచారానికి ‘ప్రాంతీయ’ నేతలు

త్వరలో ఢిల్లీకి ముఖ్యమంత్రులు స్టాలిన్‌, కేసీఆర్‌, ఉద్ధవ్‌ ఠాక్రే?

మమత, పవార్‌తో కార్యాచరణ!


న్యూఢిల్లీ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు దేశంలోని బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నుంచి రాజకీయ, నైతిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తమ పార్టీతో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ యూపీలో పొత్తు కుదుర్చుకున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బులంద్‌ షహర్‌ జిల్లాలోని అనూప్‌ షహర్‌ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థి కేకే శర్మ, మీర్జాపూర్‌ నుంచి తృణమూల్‌ అభ్యర్థి లలితేశ్‌ ప్రతాప్‌ త్రిపాఠీ పోటీ చేస్తున్నారని ఎస్పీ నాయకుడొకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అలాగే, ఆర్జేడీ, డీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, టీఆర్‌ఎస్‌, శివసేన నాయకత్వం కూడా అఖిలేశ్‌కు మద్దతు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. నిజానికి, ఈ ఎన్నికల్లో అఖిలేశ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తామన్న ప్రతిపాదన పది ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చినా.. అఖిలేశ్‌ ఇంతవరకూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రచారం ఊపందుకునే సమయంలో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా అఖిలేశ్‌ ప్రచారం చేయించవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపాయి.

యూపీలో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగితే అఖిలేశ్‌ ఒంటరిగా ప్రచారం చేయాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో, ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చ జరుగుతోందని ఆ వర్గాలు వివరించాయి. కాగా, మరో వారం, పది రోజుల్లో తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు స్టాలిన్‌, కేసీఆర్‌, ఉద్దవ్‌ ఠాక్రే ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ తదితరులతో కలిసి వారు కార్యాచరణ రూపొందించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు తెలిపాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీకి మద్దతుగా టీఆర్‌ఎస్‌ అక్కడ ప్రచారం చేసే ఆలోచన ఉందా అని ‘ఆస్క్‌ కేటీఆర్‌’ సందర్భంగా శుక్రవారం ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Where is Mayawati? BSP leader’s absence from UP poll campaign sparks speculation

 Where is Mayawati? BSP leader’s absence from UP poll campaign sparks speculation

The four-time chief minister has been limiting her public presence largely to Twitter, sparking speculation that she fears being prosecuted for 'corruption' during her rule and is trying to stay in the BJP’s good books.

 GULAM JEELANI JANUARY 06, 2022 / 04:58 PM IST

BSP chief and four-time UP Chief Minister Mayawati (FIle Picture)

BSP chief and four-time UP Chief Minister Mayawati (FIle Picture)

Addressing a public meeting in Moradabad, western Uttar Pradesh, on December 30, Union Home Minister Amit Shah wondered why Bahujan Samaj Party (BSP) chief Mayawati was yet to begin her poll campaign.


“Behenji chunav aa gaye hain, thoda baahar nikaliye. Baad mein ye na kehna maine prachaar nahin kiya tha (Sister, elections have come, please come out for a bit. Don’t say later that you did not campaign),” Shah said, addressing the four-term chief minister of Uttar Pradesh, who is popularly known as ‘Behenji’.


READ: 'Will contest Uttar Pradesh assembly election,' confirms Yogi Adityanath


The other main parties, particularly the Bharatiya Janata Party (BJP), Samajwadi Party (SP), and the Congress, have deployed their leaders to campaign for the upcoming election to the 403-member UP state assembly, due to take place between February and March.


Shah is not the only leader to question Mayawati’s absence from the poll battleground. “I cannot understand why Mayawati is so silent,” Congress general secretary in charge of Uttar Pradesh Priyanka Gandhi Vadra said while addressing the media in Delhi on December 23.


RELATED STORIES

  In Goa to unveil 13-point poll agenda, Kejriwal flaunts 'Certificate of Honesty' from PM Modi 

  Life insurers seek separate bucket for life insurance premium, tax-free annuity in Budget 

  Earnings to guide market momentum this week: Analysts 

While the BSP chief is yet to step out, Prime Minister Narendra Modi and UP chief minister Yogi Adityanath have been on a spree laying foundation stone and inaugurating infrastructure projects in the poll-bound state. Union ministers, including Amit Shah, Dharmendra Pradhan and Anurag Thakur, apart from  BJP president JP Nadda, have been spending considerable time in UP, strategising and holding public rallies.


Also, read: All political parties want UP polls be held as per schedule ensuring COVID-19 protocol: CEC Sushil Chandra


Former chief minister and SP chief Akhilesh Yadav has been busy holding public meetings since he launched his ‘Vijay Rath Yatra’ from Ghazipur on November 17. Congress leader Priyanka Gandhi Vadra, too, has been consistently active of late in state politics.


Not the first time


This is not the first time Mayawati’s political inaction has become a talking point in Uttar Pradesh. On October 6, 2020, members of the Jatav Mahapanchayat torched Mayawati’s effigy in Agra because they were unhappy over her ‘silence’ on the alleged gangrape and murder of a 19-year-old Dalit woman in a village in Hathras.


“BSP’s mission to speak for Dalits ended with the death of (its founder) Kanshi Ram,” said Ramvir Singh Kardam, president of the Jatav Mahapanchayat. Kanshi Ram, who founded the BSP in 1984 and then ceded the leadership to his protégé Mayawati, died in 2006.


The Hathras case, which sparked protests across the country, saw political leaders, including Congress’ Rahul Gandhi and Priyanka Gandhi Vadra, visiting the victim’s family amid a faceoff with the UP Police. But, Mayawati, who positions herself as “Dalit ki beti” (daughter of a Dalit), was conspicuous by her absence in Hathras. Instead, all that the 65-year-old leader did was put out a few tweets demanding action and targeting her rivals.


Some who have observed Mayawati’s politics over the years say her ‘silence’ is not surprising. “It is not easy to determine what's on her (Mayawati) mind,” Badri Narayan, political scientist and professor, Govind Ballabh Pant Social Science Institute, Allahabad, had told Moneycontrol earlier.


Earlier, too, the BSP chief has faced criticism for not stepping out of her ‘ivory tower’ as UP chief minister, as Opposition leader or as president of her party. She was not seen on the ground in the protests after the rape and murder of two Dalit girls in Badaun in 2014 when her party was in Opposition in Uttar Pradesh and the SP’s Akhilesh Yadav was chief minister.


Also, read: Partnership of political dynasties crushed UP's aspirations, says PM Modi at Purvanchal Expressway inauguration


The last time Mayawati was seen on the ground was in October at an event in Lucknow to commemorate Kanshi Ram’s death anniversary.


The rise and fall of BSP


The Mayawati-led BSP came to power with a majority in the 2007 assembly election, winning 206 of the 403 seats. Five years later, the Akhilesh Yadav-led SP defeated her by winning 224 seats. The BSP’s seat count was reduced to 80. In the 2017 assembly election, when the BJP stormed to power by winning 312 seats, the BSP was reduced to 19 seats.


This time, the party faces many challenges, apart from defections. “The party has gone through a difficult time with most legislators quitting the party or being suspended and joining other parties.” said a BSP leader, who did not want to be named.


Some BSP leaders, however, said that Mayawati is likely to begin her campaign in the coming days, after the poll dates are announced. Her presence, so far, has been limited to customary appearances at press conferences and through tweets.


Also, read: In photos: PM Modi pays tribute to freedom fighters, prays at temple in Meerut


On December 23, when Mayawati was asked in Lucknow why she was yet to start the BSP’s poll campaign, she responded by saying that her rivals have gone overboard with public rallies because they were "anxious". In her address to supporters on January 2, she cited the party’s financial constraints for staying away from the ground.


“Unlike other parties, our party is not a party of capitalists and dhannaseths. And even if we imitate the others, the scarcity of funds could hurt the party during the election,” she said.


She also responded to Shah’s remarks saying: “The money of the poor with the government exchequer is keeping the BJP leaders warm.”


There are murmurs that the former CM prefers to remain indoors because she is allergic to dust, a rumour that also did the rounds in political circles when she was UP chief minister until 2012. Another rumour has it that a skin specialist had advised her to stay away from the sun. At times her fear of being assassinated was also cited as a reason for her rare public appearances.


Cosying up to BJP


Another reason attributed to her absence is to save herself from prosecution in corruption and disproportionate assets cases. Congress general secretary Priyanka Gandhi, without naming the BSP chief, called her “an undeclared BJP spokesperson” in 2020. That year, Mayawati backed the BJP-led National Democratic Alliance (NDA) government at the Centre on the border standoff with China in the Galwan area in eastern Ladakh, and on other issues.


Mayawati’s close aide and Rajya Sabha MP Satish Chandra Mishra has rebutted these reports. Mishra has said in different interviews that Mayawati was working 18 hours a day, monitoring poll preparedness finalising candidates for the upcoming polls.


Wary of the void created by the absence of the BSP on the ground, the BJP and the SP have, however, been trying to woo the 22 percent Dalit population, considered the vote base of the BSP. While the BJP has been reaching out to Dalit voters since the runup to the 2014 general elections, the SP has started wooing the vote bank this time around to improve its chances.



Also, read: Congress’ uphill task in UP: Finding 160 women candidates with a shot at winning


Addressing a public rally in Unnao, near Lucknow, on December 28, Akhilesh Yadav exhorted the Samajwadis and Ambedkarwadis to come together to “throw away” the government in UP. The term Samajwadis refers to followers of the SP, while Dalits are referred to as Ambedkarwadis for they are avid followers of BR Ambedkar, the architect of the Indian Constitution.

 GULAM JEELANI is a journalist with over 12 years of reporting experience. Based in New Delhi, he covers politics and governance for Moneycontrol.












Thursday, January 13, 2022

కాశీ కారిడార్‌ : మనసులూ విశాలం కావాలి

 Jan 5 2022 @ 02:22AMహోంఎడిటోరియల్ఇండియాగేట్కా


కాశీ కారిడార్‌ : మనసులూ విశాలం కావాలి


అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750ఆశ్రిత కళాకారులు, కవులు, పండితులు రాజు అభిరుచికి అనుగుణంగా ఆయనను అలరింప చేసేందుకు ప్రయత్నిస్తారు. అలానే వర్తమాన భారతదేశంలో వ్యవస్థలన్నీ అధికార పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెలలో కాశీ విశ్వనాథుడి కారిడార్‌ను ప్రారంభించారు. బిజెపి పాలిత 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 9 మంది ఉపముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 51వేల ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్ల ద్వారా ఆ కార్యక్రమ ప్రత్యక్షప్రసారం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు వారణాసిలో పని గట్టుకుని పలు సదస్సులు నిర్వహించాయి. మేయర్ల సమావేశాలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సెమినార్లు కూడా అక్కడే జరిగాయి. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న సంగీత, నాటక అకాడమీ, లలిత్ కళా అకాడమీ కూడా తమ వంతు కర్తవ్యంగా ప్రదర్శనలు, కళాత్మక కార్యక్రమాలు నిర్వహించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా కాశీపై రోజంతా పండిత గోష్ఠి నిర్వహించక తప్పలేదు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ధ్వంసం చేసిన కాశీ విశ్వనాథ మందిరం, ఇంకా అనేక ఆలయాలను మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ (1725–95) పునర్నిర్మించారు. ఆ పుణ్యచరిత పవిత్ర వారసత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరించారని బిజెపి నేతలు, మఠాధిపతులు ప్రశంసించారు. మోదీ సైతం తన ప్రసంగంలో అహల్యాబాయిని ఘనంగా కొనియాడారు. గొల్ల కులానికి చెందిన అహల్యాబాయి ఆదర్శబాటను గానుగ తిప్పే కులానికి చెందిన మోదీ అనుసరించారని ‘స్వరాజ్య’ పత్రిక వ్యాఖ్యానించింది. అహల్యాబాయి హోల్కర్ తర్వాత ఆలయాలను పునరుద్ధరించిన తొలి హిందూ నేత మోదీ అని బిజెపి ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవ్య ప్రశంసించారు. కాశీ విశ్వనాథ మందిర కారిడార్ నిర్మాణానికి మోదీ, బిజెపి నేతలు, వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కల్పించిన ఉధృత ప్రచారం చూసిన వారెవరికైనా రాబోయే ఎన్నికల్లో ప్రజల మనసులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆ ఘట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న విషయం స్పష్టమయింది. ‘మన ఎన్నికల ప్రచారంలో కాశీ, అయోధ్య ప్రధాన భాగం కావాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నవంబర్‌లోనే వారణాసి నుంచి ఎన్నికల వ్యూహరచన ప్రారంభించిన సందర్భంగా కార్యకర్తలకు స్పష్టం చేశారు. కాశీ కారిడార్‌ను ప్రారంభించిన తర్వాత ఎబిపి న్యూస్, సి–ఓటర్ నిర్వహించిన సర్వేలో 57 శాతం ప్రజలు బిజెపికి అనుకూలంగా మారారని వెల్లడయింది. 

ప్రతి నగరానికీ ఒక చరిత్ర ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటైన కాశీ గురించి ఏదోరకంగా నైనా ఇంత ప్రచారం రావడం సంతోషకరమే. ‘కాశీ నగరం చరిత్ర కంటే పురాతనమైది, సంప్రదాయం కంటే ప్రాచీనమైనది, ఇతిహాసం కంటే పురాతనమైనది, వాటన్నిటి కంటే రెట్టింపు పురాతనమైనది’ అని అమెరికా సాహిత్యవేత్త మార్క్‌ట్వైన్ ఏనాడో అభివర్ణించారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాత్మకంగా వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పటి నుంచే ఆ నగరం రాజకీయంగా వార్తల్లోకెక్కింది కాని, కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం, ఆధ్యాత్మిక సాంత్వన కోసం మాత్రమే కాక జ్ఞానాన్వేషణ కోసం కోట్లాది ప్రజలు ఎప్పటి నుంచో దేశ, విదేశాల నుంచి ఈ నగరానికి వస్తూనే ఉన్నారు. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందినట్లు గుర్తింపు పొందిన స్కంద పురాణంలోని కాశీఖండంలో కాశీ ఉద్భవం గురించి, ధార్మిక ఆధ్యాత్మిక మహత్వం గురించి విస్తారంగా చర్చించారు.

ధార్మిక, విద్యా, వైదుష్య, సాంస్కృతిక, దార్శనిక నగరమైన కాశీని రాజకీయ కోణం నుంచో, మతపరమైన దృష్టి నుంచో అంచనా వేయడమంటే సముద్రాన్ని గుప్పిట్లో బంధించే ప్రయత్నం చేసినట్లే అవుతుంది. 2500 సంవత్సరాల క్రితమే సిద్ధార్థ గౌతముడు కాశీకి వచ్చి బౌద్ధ ధర్మ బోధనను అక్కడి నుంచే ప్రారంభించాడు. అదే ధర్మ చక్ర ప్రవర్తనంగా పేరొందింది. జైన తీర్థంకరుడూ ఇక్కడే జన్మించాడు. కాశీలోనే శంకరుడు పండితులతో శాస్త్రచర్చలు ప్రారంభించాడు. మండనమిశ్రుడిని ఢీకొన్నాడు. రామానుజుడు, మధ్వాచార్యులతో పాటు తెలుగువాడైన వల్లభుడు తాత్విక చింతన చేసింది ఇక్కడే. తూర్పు గోదావరి జిల్లా ముంగండ అగ్రహారానికి చెందిన జగన్నాథ పండిత రాయలు వారణాసిలో వివిధ శాస్త్రాలు అధ్యయనం చేసి, షాజహాన్ చక్రవర్తి ఆస్థానంలో ప్రముఖ స్థానం పొందాడు. రామచరిత మానస్‌ను ప్రజల భాషలో రచించి, వారి హృదయాల్లో స్థానం పొందిన తులసీదాస్ ఇక్కడివాడే. ‘రామ్ రహీమ్ ఏక్ హై’ అని చాటి చెప్పిన మార్మిక కవి కబీర్ కూడా కాశీలోనే జన్మించాడు. మూఢాచారాల్ని ప్రశ్నించిన కబీర్ కవితలను ప్రపంచవ్యాప్తంగా ఎందరో సాహితీవేత్తలు తమ తమ భాషల్లోకి అనుసృజించుకున్నారు. కబీర్ గురువైన రామానందుడూ కాశీ వీథుల్లో సంచరించినవాడే. ప్రముఖ అమెరికన్ కవి ఎజ్రా పౌండ్, మన రవీంద్రనాథ్ టాగోర్ కూడా కబీర్ కవితల్ని ఆంగ్లంలోకి అనువదించారు. స్వామి వివేకానందుడినే కాదు, బెంగాలీ మహారచయిత శరత్‌చంద్ర చటర్జీ, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతినీ ఆకట్టుకున్న నగరం ఇది. చమార్ కుటుంబంలో జన్మించి, అందరూ సమానులే అని ఘోషించిన తాత్విక కవి, సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక వేత్త రవిదాస్ కూడా వారణాసి నుంచే ప్రకంపనలు సృష్టించాడు. 

ఆధునిక హిందీ సాహిత్యానికి, పత్రికారచనకూ కూడా కాశీతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నది. ఒక రకంగా హిందీ భాషకు వెన్నెముక నిచ్చింది కాశీ నగరమే. ప్రజల జీవితాలను తన సాహిత్యంలో చిత్రించిన భారతేందు హరిశ్చంద్ర కాలంలోనే హిందీ పాత్రికేయరంగం అభివృద్ధి చెందింది. ఆధునిక హిందీ సాహిత్య నిర్మాతల్లో ఒకరైన ఛాయవాద కవి జయశంకర్ ప్రసాద్ కాశీవాసి. మహాకావ్యం కామాయనితో పాటు అనేక కవితలు, నాటికలు, కథలు, నవలలను ఆయన కాశీలోనే రచించారు. హిందీ, ఉర్దూ భాషల్లో అభ్యుదయ సాహిత్యానికి ఒరవడి సృష్టించి సామాన్యులను, అభాగ్యులను, రైతులను కథానాయకులుగా మార్చిన మహారచయిత ప్రేమ్‌చంద్ కూడా కాశీవాడే. హిందీ సాహిత్య దిగ్గజాలు హజారీ ప్రసాద్ ద్వివేదీ, రామచంద్ర శుక్లా కాశీపుత్రులే. ‘భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు. ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ, పారశీకులది కూడా, అందర్నీ జ్ఞానవంతులు చేయాలన్నదే మా ఉద్దేశం’ అన్న లక్ష్యంతో మదన్మోహన్ మాలవ్యా స్థాపించిన కాశీ హిందూ విశ్వవిద్యాలయం ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, కళాకారులు, రచయితలు ఎందరినో ప్రపంచానికి అందించింది. ప్రముఖ హిందీసాహిత్య విమర్శకుడు నామ్‌వర్ సింగ్, ఆయన సోదరుడు, రచయిత కాశీనాథ్ సింగ్ కాశీకి చెందినవారే. ఆధునికతకూ, ప్రాచీనతకూ వారధిగా నిలిచిన గోపీనాథ్ కవిరాజ్ తన రచనలతో లక్షలాది సామాన్యులకు స్ఫూర్తిని వెలిగించింది ఇక్కడే. ‘ప్రేమను వ్యాపించలేకపోయావు కదా, ద్వేషాన్ని చల్లార్చి వెళ్లు, మేలుకో, ప్రేమ, ఆప్యాయతల గంగను ప్రవహించి వెళ్లు’ అని సమకాలీన సమాజాన్ని జాగృతం చేసిన నజీర్ బన్సారీ వారణాసి వీధుల్లో గజళ్లు రచిస్తూ తిరిగినవాడే.

ఎన్నని చెప్పవచ్చు? ఎంతమందినని ఉటంకించవచ్చు? కాశీ ఆధ్యాత్మిక నగరం అన్నది ఒక పార్శ్వం మాత్రమే. కాని అది మేధోనగరం, సాహితీనగరం. జ్ఞానాన్వేషణకు నిలయమైన నగరం. శాస్త్ర చర్చలకు కేంద్రమైన నగరం. బౌద్ధాన్ని, సూఫీయిజాన్ని మేళవించిన నగరం. పేదలు, కడుపు కాలిన అన్నార్తులు, అభాగ్యులు, అభాగినుల జీవనగాథల్ని చిత్రించిన నగరం. ముఖ్యంగా ప్రశ్న కు, చింతనకు, చర్చలకూ కేంద్రమైన నగరం. వర్తమాన భారతదేశ పాలకులు విభిన్న ఆలోచనలు, ప్రశ్నలు, చర్చలకు ప్రాధాన్యం ఎంతవరకు కల్పిస్తున్నారు?

అంతే కాదు, ఎంత ఆధ్యాత్మిక, జ్ఞానాన్వేషణకు నిలయమైతేనేం, స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ల వరకూ కాశీ విశ్వనాథుడి ఆలయంలో దళితుల ప్రవేశాన్ని నిషేధించిన నగరం అది! ‘విశ్వనాథుడి మందిరంలో దళితులకు తలుపులు మూసినంత కాలం విశ్వనాథుడు ఆ మందిరంలో నివసించడు. దేవాలయ పవిత్రతపై నమ్మకం పెట్టుకోలేను, నా పాపాలు ప్రక్షాళనం అవుతాయన్న విశ్వాసంతో పూజించలేను’ అని మహాత్మాగాంధీ 1936లో ఆవేదన వ్యక్తం చేసిన నగరమది. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం 17వ అధికరణలో అస్పృశ్యతను నిషేధించిన ఏడేళ్ల తర్వాత కాని కాశీనాథుడి మందిరంలో దళితులకు ప్రవేశం లభించలేదు. అది కూడా ఎన్నో హింసాత్మక నిరసనలు, మతాధికారుల బహిష్కరణల మధ్య జరిగింది.

మరి ఇవాళ నరేంద్రమోదీకి ఆ చరిత్ర తెలిసి చేశారో లేదో చెప్పలేము కాని ఆయన కాశీ విశ్వనాథ మందిర నిర్మాణ కార్మికులపై పూలవర్షం కురిపించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ ప్రాచీననగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, గ్రామాల్లో తమ నెత్తుటితో సంపద సృష్టించే కోట్లాది కార్మికులు, శ్రమజీవుల స్వేదబిందువుల కష్టాలకు సరైన పరిష్కారం లభించినప్పుడే వారు తమ కుటుంబాలతో సంతోషంగా కలిసి భోజనం చేయగలుగుతారు. కరోనా మొదటి ప్రభంజనం సమయంలో నగరాలను వదిలి వందలాది మైళ్ల దూరంలోని స్వగ్రామాలకు కాలినడకన వెళ్ళిన వారిపై ఎవరు పూలవర్షం కురిపిస్తారు? ‘పైకి మనం శరీరాన్ని నీటితో కడుక్కుంటాం కాని హృదయం అన్ని పాపాలతో నిండి ఉన్నప్పుడు అది స్వచ్ఛత ఎలా అవుతుంది? అది స్నానం చేసిన వెంటనే బురదను కప్పుకునే ఏనుగుకూ మనకు తేడా ఏముంది?’ అని రవిదాస్ గురుగ్రంథ సాహెబ్‌లో ఏనాడో అన్నారు. ‘గంగా, గోమతీ నదుల్లో స్నానం చేసి పవిత్రులమని భావిస్తే అది మూర్ఖత్వమే’ అని కబీర్ కూడా ఆనాడే స్పష్టం చేశారు. ‘అన్యాయానికి వంత పలకడం అన్యాయం చేసినట్లే లెక్క’ అని మున్షీ ప్రేమ్‌చంద్ కూడా ఇదే నేల నుంచి ఘోషించాడు. కాశీ విశ్వనాథుడి కారిడార్లు విశాలం చేయడం మంచిదే. కాని రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా మన హృదయాలను విశాలం చేయడమే నేటి కర్తవ్యం.

ఎ. కృష్ణారావు(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌, పంజాబ్‌ - గెలుపోటముల అంచున బీజేపీ

 గెలుపోటముల అంచున బీజేపీ

Jan 12 2022 @ 01:24AM


ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌, పంజాబ్‌ 

నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నంతవరకు అది ఉత్తర ప్రదేశ్‌లో నంబర్ 1 పార్టీగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడా కనపడడం లేదు. నేను బిజెపిలో చేరిన తర్వాత అది 14 సంవత్సరాల వనవాసం పూర్తిచేసుకుని మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సమాజ్‌వాది పార్టీలో చేరుతున్నానంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అర్థం చేసుకోవచ్చు.. అబ్ పతా చలేగా బిజెపికో.. ‘అని మంగళవారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బిజెపి నుంచి నిష్క్రమించిన ప్రముఖ ఓబీసీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. ఆయనతో పాటు కనీసం పన్నెండు మంది బిజెపి ఎమ్మల్యేలు సమాజ్‌వాది పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ‘ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా బిజెపి పనిచేస్తున్నదని నేను చాలాసార్లు చెప్పాను. అయితే నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు. బిజెపి హయాంలో దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారుల అణిచివేత సాగుతోంది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను’ అని మౌర్య అన్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మౌర్య సమాజ్‌వాది పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీలను కూడగట్టేందుకు ఒకప్పుడు బిజెపికి తోడ్పడిన నేత. ఆయన కుమార్తె సంఘ మిత్ర కూడా బిజెపి తరపున ఎంపీగా ఎన్నికయ్యారు.

ఉత్తరప్రదేశ్‌తో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు మరింత వేగవంతమయ్యాయి. ఫిబ్రవరి 10న తొలి విడత ఎన్నికలు ప్రారంభమయ్యే లోపు అనేక రాజకీయ పరిణామాలకు ఆస్కారం ఉన్నది. టిక్కెట్ల పంపిణీ ఆయిన తర్వాత కూడా అనేక చోట్ల రాజకీయాలు తారుమారయ్యేందుకు అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పంజాబ్ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి అవలీలగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని నాలుగైదు సర్వేలు తేల్చడానికి ఎంత విలువ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. విచిత్రమేమంటే ఈ సర్వేలన్నీ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. భారతదేశంలో సర్వేలు పూర్తిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. గత ఏడాది పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సర్వేల్లో ఏ ఒక్క సర్వే కూడా మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు దాటుతుందని చెప్పలేదు. తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన సంస్థలు కూడా ఆ పార్టీ బొటాబొటి ఆధిక్యత సాధిస్తుందని మాత్రమే చెప్పాయి. కొన్ని సర్వే సంస్థలయితే పశ్చిమబెంగాల్‌లో బిజెపియే అధికారంలోకి వస్తుందని, 173-192 సీట్లు గెలుచుకుంటుందని ఘంటాపథంగా తేల్చాయి. చివరకు తృణమూల్ కాంగ్రెస్ 294 సీట్లలో 215 సీట్లను సాధించి సర్వేకారులను సైతం విభ్రమంలో ముంచెత్తింది. సర్వే సంస్థలు విఫలం కావడానికి అనేక కారణాలుండవచ్చు. అవి ప్రాయోజిత సర్వేలు కావడం ఒక ప్రధాన కారణం. ప్రజలు చాలా వివేకంగా వ్యవహరిస్తూ చివరి నిమిషం వరకు తమ మనసులో మాట బయటకు వ్యక్తం చేయకపోవడం కూడా సర్వేలను విఫలం చేస్తుంది.

సర్వేలను ప్రక్కన పెడితే నిజానికి ఏ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అంత సులువుగా విజయం సాధించే అవకాశాలు లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి విపరీతంగా కష్టపడాల్సి వస్తోందన్న విషయం ఆ పార్టీ నేతలకు అవగతమయింది. ఎన్నికలు మరో ఒకటి రెండు నెలలు ఉండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగప్రవేశం చేసి పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించినంత మాత్రాన అభివృద్ధి జరుగుతోందని ప్రజలు నమ్మి ఓట్లు వేసే అవకాశాలు లేవని బిజెపికి తెలియనిది కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఉపాధి కల్పన పరిస్థితి అయిదేళ్ల కంటే ఇప్పుడు ఎంతో ఘోరంగా ఉన్నదని, 2016లో 38.5 శాతం ఉన్న ఉపాధి కల్పన 2021 నాటికి 32.8 శాతానికి తగ్గిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తేల్చింది. బిజెపి ప్రభుత్వం చెప్పుకున్నట్లు కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగి ఉంటే ఉపాధి కల్పన పెరగాలి కాని తగ్గిపోయే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మోదీ జనాకర్షణ వల్ల బిజెపి గెలిచింది. కాని ఇప్పుడు ఏడు సంవత్సరాల ప్రధాని మోదీ ప్రభుత్వం, అయిదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల జనం వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉన్నాయి. రైతులు, యువత, దళితులు, ఓబీసీలతో పాటు వివిధ వర్గాలలో బిజెపి పాలన పట్ల వ్యతిరేకత చాప క్రింద నీరులాగా పాకిపోతోంది. అభివృద్ధి ప్రాతిపదికగా ఎన్నికల్లో పోటీ చేస్తే జనం ఆదరించే అవకాశాలు లేవని తెలిసినందువల్లే బిజెపి హిందూత్వ ఎజెండాను ముందుకు నెట్టింది. కాశీ కారిడార్ నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణం బిజెపి ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశాలయ్యాయి. ఈ ఎన్నికలు 80 శాతానికీ, 20 శాతానికీ మధ్య పోటీగా ఆదిత్యనాథ్ అభివర్ణించడం ద్వారా హిందువులు, ముస్లింలకు మధ్య పోటీ జరుగుతున్నట్లు చిత్రించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడమే హిందూ ఓట్లను సంఘటితం చేయడం కోసం కాని ఆయన హయాంలో వివిధ కులాల మధ్య చీలికలు తీవ్రమయ్యాయి. బ్రాహ్మణులు, రాజపుత్రుల మధ్య, యాదవులు, యాదవేతరుల మధ్య, జాతవులు, జాతవేతరుల మధ్య, జాట్లు, ఇతరుల మధ్య సమాజం మరింత విభజనకు గురైంది.

పంజాబ్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ బిజెపి ఖాతా తెరిచే అవకాశాలు ఉన్నాయా అన్నది అనుమానమే, సాగుచట్టాలను వెనక్కు తీసుకోవడం ద్వారా సిక్కుల మనసులను కరిగించే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని అర్థమవుతోంది. అమరీందర్ సింగ్‌తో పాటు పలువురు నేతలు కష్టపడినా పంజాబ్‌లో బిజెపి సభలకు జనాన్ని పోగు చేయడం కష్టమవుతోంది. ప్రధాని మోదీ హాజరుకావల్సిన ఫెరోజ్‌పూర్‌లో 70 వేల మందికి కుర్చీలు వేస్తే 5 వేలమంది మాత్రమే వచ్చారని ‘ద ట్రిబ్యూన్’ పత్రిక రాసింది. ప్రధాని భద్రత విషయంలో వైఫల్యం జరిగిన తర్వాత జనంలో సానుభూతి ఎంతవరకు ఏర్పడుతుందో చెప్పలేము. ఈ భద్రతా వైఫల్యంపై కేంద్రం నియమించిన కమిటీ నిష్పాక్షికతలో తమకు నమ్మకం లేదని, కేంద్రం రాజకీయాలు ఆడే అవకాశం ఉన్నదన్న పంజాబ్ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సైతం అంగీకరించి స్వతంత్ర కమిటీని నియమించడం గమనార్హం. ఒకవైపు సుప్రీం విచారణ జరుపుతుండగా పంజాబ్ అధికారులకు నోటీసులు ఎందుకు పంపారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ప్రశ్నించడం కేంద్రం దూకుడుకు కళ్లెం వేసింది.

ఉత్తరాఖండ్‌లో బిజెపి అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారంలో లేని ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు వేర్వేరు శిబిరాలు నడుపుతున్నారు. ఈ రాష్ట్రంలో బిజెపి విజయం సాధిస్తే నరేంద్రమోదీ ఆకర్షణ మరోసారి పనిచేసినట్లు లెక్క. గోవాలో గత పది సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉన్నది, గత ఎన్నికల్లో బిజెపి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్‌తో సహా మిగతా పార్టీలను చీల్చి అత్యంత దౌర్జన్యంతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనోహర్ పరిక్కర్ మరణం తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో బిజెపి గోవాలో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది.

నాగాలాండ్‌లో 14 మంది అమాయకులను కాల్చి చంపి, కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఈశాన్య భారతం కుతకుతలాడుతోంది. కనుక మణిపూర్‌లో బిజెపికి ఈ సారి పరిస్థితులు అంత సవ్యంగా లేవనే చెప్పవచ్చు. ఈ అయిదు రాష్ట్రాల్లో పరిస్థితులు అంత సానుకూలంగా లేవన్న వాస్తవం ప్రధాని మోదీకి తెలియనిదేమీ కాదు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా రకరకాల వ్యూహాలు రచించి బిజెపిని పోటీలో బలంగా ఉంచగల సత్తా ఆయనకు ఉన్నది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా అనేక పరిణామాలు సంభవించాయి. వీటన్నిటినీ తట్టుకుని మెజారిటీ రాష్ట్రాల్లో ముఖ్యంగా యూపీలో బిజెపి అధికారంలోకి రాగలిగితే దేశంలో ఆ పార్టీని అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదనే నిర్ధారణకు రావల్సి ఉంటుంది.ఎ. కృష్ణారావు(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)